ఇవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందట..

0
114

ప్రస్తుతం షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి భారీన పడినవారు ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా తీసుకునే పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. అంతేకాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యనిపుణులు చేబుతుంటారు. ఇంకా షుగర్ వ్యాధి నుండి బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

షుగర్ ఉన్న వాళ్లు పిస్తా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ డ్రై ఫ్రూట్ తినడం వల్ల షుగర్ పెరగక పోవడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

వాల్​నట్స్ తినడం వల్ల డయాబెటిక్ రోగులకు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వాల్​నట్​ గ్లైసెమిక్ తక్కువ ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్​కి ఇది మేలు చేస్తుంది. ఇవి తీయగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ తినడానికి ఇష్టపడతారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.