సబ్జా గింజలు.. ఇవి సమ్మర్ వచ్చింది అంటే కచ్చితంగా అందరూ తీసుకుంటారు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. శరీరంలో వేడిని ఇట్టే తగ్గిస్తాయి.. ఇక దాహం వేసింది అంటే కచ్చితంగా నీరు తాగుతాం .. అదే ఈ సబ్జానీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. - Advertisement -
ఇవి దాదాపు అన్ని కిరాణా, సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. మీరు ఓ చెంచాడు ఈ సబ్జాగింజలు నీటిలో వేసుకుని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టి తాగితే శరీరానికి ఎంతో మంచిది వేడి తగ్గుతుంది.కూల్డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.. అందుకే ఇలా సబ్జాగింజలు తీసుకుంటే చాలా మంచిది, మీరు ఆఫీసులోఉన్నా వాటర్ బాటిల్ లో వేసుకుని ఇంటి నుంచి తీసుకువెళ్లండి మీకు అక్కడ ఇబ్బంది ఉండకుండా మధ్యాహ్నం తాగవచ్చు. శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తాయి. జ్వరం వచ్చిన వారికి ఎంతో మేలు. ఇక ఎవరైనా బరువు ఉన్నారు అంటే కాస్త తగ్గుతారు.. మరీ ముఖ్యంగా సబ్జా గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఇవి తాగితే చాలా బెటర్. ఇక మలబద్దకం సమస్య తగ్గుతుంది..గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం కూడా తగ్గుతాయి.
|
|
సమ్మర్ వచ్చేసింది సబ్జా గింజలు ఇలా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది
-