మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందని తెలిపే లక్షణాలు ఇవే

Symptoms that indicate a low level of immunity in the body

0
91

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే వారిపై వైరస్ లు సులువుగా దాడి చేస్తాయి. అందుకే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీపవర్ పెంచుకునే విధంగా ఉండాలి అంటారు వైద్యులు. ఇమ్యునిటీ వీక్ గా ఉన్న వాళ్లపై ఈ వైరస్ లు దాడి చేస్తాయి. తరచూ జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటివి వేధిస్తూ ఉంటాయి. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా గుర్తించాలి ? ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా అనేది చూద్దాం.

కంటి నిండా నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా గుట్కాలు మందు వీటికి దూరంగా ఉంటే 50 శాతం ఇమ్యునిటీ కచ్చితంగా పెరుగుతుంది. బాక్టీరియల్, ఫంగల్ దాడుల నుంచి మన శరీరాన్ని రక్షించేదే మన రోగనిరోధక వ్యవస్థ. సో ఇది వీక్ అయితే ముందుగా మనకు తరచూ సీజనల్ ఫ్లూలు కనిపిస్తాయి.

జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి
గాయాలు ఆలస్యంగా మానతాయి, చీము పట్టడం, రక్తం రావడం జరుగుతుంది.

విపరీతమైన అలసట అసలు ఏ పనీ చేయలేకుండా ఉంటారు.

ఎక్కువ జలుబు, ముక్కు పట్టడం, గొంతు నొప్పి ,కఫం ఎక్కువగా రావడం వేధిస్తాయి.

ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.

ఈ లక్షణాలు నెలలో కచ్చింగా ఒకసారి అయినా కనిపిస్తున్నాయి అంటే ఇమ్యునిటీ పవర్ తక్కువ ఉందని అర్దం. వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.