కరోనా టీకా పై కీలక ప్రకటన చేసిన తజికిస్తాన్

0
87

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇక మన దేశంలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోంది. అన్నీ రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ లు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఓ దేశం కీలక ప్రకటన చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని తజికిస్తాన్ కీలక ప్రకటన చేసింది. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది.

18ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు ఫ్యామిలీ డాక్టర్ ను కానీ, స్థానిక ఆరోగ్య కేంద్రంలోనైనా సంప్రదించాలని తెలిపింది. కచ్చితంగా దేశంలో పిల్లలు మినహా అందరూ టీకా తీసుకోవాల్సిందే అని కీలక ప్రకటన చేసింది. తజికిస్తాన్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో ఈ ప్రకటన చేశారు.

జూన్ 21 నుంచి వ్యాప్తి పెరిగిందని హెల్త్ మినిష్ట్రీ కన్ఫామ్ చేసింది. దేశవ్యాప్తంగా 260కేసులు నమోదుకాగానే అలర్ట్ అయింది. మొత్తం ఇప్పటి వరకూ నమోదు అయిన కేసుల సంఖ్య 13వేల 569మాత్రమే. ఐదు నెలలుగా ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దేశం, మరోసారి కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది.