వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఇవి తీసుకోండి..

0
112

వేసవి వచ్చిందంటే చాలు ఎండల ప్రభావం చర్మంపై పడి చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వల్ల కేవలం ఆరోగ్య సమస్యలే కాదు.. పలు చర్మ సంబంధిత సమస్యలూ కూడా ఎదురవుతుంటాయి. మరి వాటి నుంచి మన చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అయితే ఈ చర్మ సమస్యలు ఎదుర్కోవాలంటే కొబ్బరి నీళ్ళు ఎంతో ఉపయోగపడతాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని అప్లై చేయడం వల్ల ముఖంపై మొటిమలు కూడా తొలగిపోతాయి.

చర్మంపై ఉన్న నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో సమస్యలకు  చెక్ పెట్టొచ్చు. టానింగ్ లేదా సన్ బర్న్ తొలగించడానికి ముఖానికి కొబ్బరి నీళ్లతో చేసిన ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవచ్చు.