మన శరీరంలో ప్రధాన అవయవాల్లో గుండె కూడా ఒకటి ..దానిని మనం ఎంతో పదిలంగా చూసుకోవాలి, మన శరీరం అంతా రక్తం వెళ్లేలా చేస్తుంది గుండె ..అందుకే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి, మరి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాగే హర్ట్ అటాక్ గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలి అనేది చూద్దాం.
ఇక ప్రధానంగా బరువు సమస్య ఉన్నవారికి హర్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు..
అలాగే భారీ కాయం ఉన్న వారికి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
భోజనం చేసినా.మళ్లీ చిరుతిళ్లవంటివి తినకండి
నాన్ వెజ్ అతిగా తినద్దు
మసాలా ఫుడ్ ని అవాయిడ్ చేయాలి
భోజనం మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి.
ఫ్రైలు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ మితంగా తీసుకోండి మానేసినా పర్వాలేదు
కొవ్వు ఎక్కువ ఉన్న ఫుడ్ వల్ల గుండెకు ప్రమాదకరం
ఇలాంటి ఫుడ్ తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు… రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే మేలు.రైస్, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జలు తింటే మేలు. అలాగే అస్సలు తినకూడని ఆహారం అంటే . డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.
ఇక పండ్లు ఆకుకూరలు తింటే ఎలాంటి సమస్య ఉండదు, బరువు పెరగకుండా కొవ్వు పదార్ధాలు కాకుండా తింటే మీకు ఏ సమస్య రాదు.