జుట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తుంది. మరి ఈ సమస్య తగ్గడానికి చాలా మంది షాంపూలు అనేక రకాల మెడిసన్స్ వాడుతూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు. మీరు బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా తలని స్కార్ఫ్, టోపీ సాయంతో కవర్ చేయాలి. ముఖ్యంగా పొల్యూషన్ ఏరియాలో తిరిగినప్పుడు ఈ చిట్కాని తప్పకుండా పాటించాలి. ఇక లాంగ్ జర్నీ చేసే సమయంలో హెల్మెట్ వాడేవారు దానికి కర్చీఫ్ పైన కట్టుకోవాలి. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వదు.
తలలో ఎప్పటికప్పుడు దుమ్ము పేరుకుపోయి స్కాల్ఫ్ చుండ్రులా తయారవుతుంది. కచ్చితంగా తలారాస్నానం చేయాలి. అబ్బాయిలు రెండు రోజులకి ఓసారి అమ్మాయిలు వారానికి రెండు రోజులు కచ్చితంగా తలకి స్నానం చేయాలి.
ఎక్కువగా హెయిర్ డ్రయ్యర్స్ కలర్స్, వాడవద్దు. వీటి వల్ల జుట్టు చిట్లిపోతుంది.
కచ్చితంగా 15 రోజులకి ఓసారి అయిన ఆయిల్ అనేది తలకి పట్టించాలి. జిడ్డు అవుతుంది అని ఆలోచన వద్దు.
మంచి కండీషనర్ కూడా జుట్టుని కాపాడుతుంది. కాబట్టి వారంలో అప్పుడప్పుడూ కచ్చితంగా మంచి కండిషనర్ని కేశాల కోసం వాడుకోవచ్చు.