సాధారణంగా చాలా మంది తలపట్టుకుని తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటారు, ఇంకొందరు అయితే రోజులో రెండు మూడుసార్లు అయినా ఈ తలనొప్పి సమస్య గురించి చెబుతూ ఉంటారు, అయితే తీవ్రమైన ఒత్తిడి ఆలోచన వల్ల తలనొప్పి వస్తుంది, అలాగే విపరీతమైన వేడి కూడా తలనొప్పికి కారణం అనేది మర్చిపోకండి. ఇక మరీ ముఖ్యంగా నిద్ర పోకుండా ఉండటం, ఎక్కువ రాత్రిపూట వర్క్ చేస్తూ ఉంటే ఉదయం తలనొప్పి వస్తుంది.
తలనొప్పి ఇలాంటివి చేసినా వస్తుంది అంటున్నారు నిపుణులు, మరి అవి ఏమిటి అనేది తెలుసుకుందాం, సాధారణంగా మనం తలస్నానం చేస్తే వెంటనే జుట్టు ఆరబెట్టాలి లేకపోతే ఆ తలనొప్పి వస్తుంది, గాలిలో ఆరేలా చూసుకోండి తలని. ఇక బాగా ఎండలో తిరిగి వస్తే వెంటనే ఫ్యాన్ కింద కూర్చున్నా తలనొప్పి వస్తుంది.
అలసట ఉన్నా ఖాళీ కడుపుతో ఉన్నా ఈ తలనొప్పి సమస్య వేధిస్తుంది.. కొన్ని రకాల సెంట్లు ఎవరైనా వాడిన సమయంలో అది పడకపోయినా తలనొప్పి వస్తుంది, ఘాటు మసాలా పోపుల స్మెల్ పీలిస్తే తలనొప్పి వస్తుంది. వీటికి దూరంగా ఉండాలి.
ఉద్యోగులు ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి వస్తుంది, సో దీనికి దూరంగా ఉండాలి,కనీసం రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి లేకపోతే ఈ సమస్య తప్పకుండా వస్తుంది.