వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

0
89

రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. భానుడు తన విశ్వరూపాన్ని చూపెట్టడంతో ప్రజలు తల్లుకోలేక పోతున్నారు. అందుకే ప్రతిఒక్కరు వేసవి కాలం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తలు: ఎండలో పిల్లల్ని బయటకు పంపించకండి. ఎండలో దూర ప్రయాణాలు చేయనీయకండి. అలానే సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా ఇంటిదగ్గేరే ఉంచండి. ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోండి. ఎండలో బయటకి వెళ్ళినపుడు టోపీని వేయండి లేదంటే గొడుగు తీసుకు వెళ్ళండి. వాళ్లకి కాటన్ దుస్తులు మాత్రమే వెయ్యండి.

అలానే సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయడం కూడా మంచిది. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, నీళ్లు, ఓఆర్ఎస్ వంటివి తాగించండి. శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ శక్తి కోల్పోయిన నేపథ్యంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ జాగ్రత్తలు పాటించి మీ పిల్లల్ని వడదెబ్బ నుండి కాపాడుకోండి.