కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఇవి తీసుకోండి..

0
97

మనం ఈ లోకాన్ని చూడాలంటే కళ్ళు తప్పనిసరి. కళ్ళు లేనిదే మనం ఏ పని చేయలేము. అందుకే ముందుగా కళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకు జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. జీడిపప్పు లో ఫైబర్, ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా షుగర్ కూడా తక్కువగా ఉంటుంది.

జీడిపప్పు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల కళ్ళు బాగా కనబడడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందే జీడిపప్పును ఎంత తీసుకుంటే అంత మంచిది.

కంటి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం జీడిపప్పే కాకుండా మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడుతుంది. విటమిన్ A కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ఎక్కువగా పసుపు రంగులో ఉన్నపండ్లలో విటమిన్ ఏ ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. కనుక వీటిని మీ డైట్ లో ఎక్కువగా తీసుకోవడం మంచిది.