రక్తం మనిషికి ఎంతలా సాయపడుతుందో తెలిసిందే, రక్తం శరీరంలో తక్కువ ఉంది అంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. ఇక బ్లీడింగ్ సమస్య ఎక్కడా ఉండకూడదు, ఈ రక్తం ఎక్కడైనా అవయవాల నుంచి వచ్చినా వెంటనే మీరు వైద్యుడ్ని సంప్రదించాలి.. దీనిలో ఎలాంటి అలసత్వం వద్దు… ఇక ఈ విషయం గుర్తు ఉంచుకోండి.. శరీరంలో ఉన్న రక్తంలోని ఎర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది.
దీనినే అనీమియా అంటారు. ఇలా రక్తహీనత రావడానికి ప్రధాన కారణం మనకు ఐరన్ లోపం ఉండటం, మరి మనం మందులు వాడుతూ ఉంటాం అయితే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి, ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఈజీగా ఈ లోపం తగ్గుతుంది.
కోడి, చేప లాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది. మరి నాన్ వెజ్ తినేవారికి ఒకే మరి వెజిటేరియన్ తినేవారు ఏం తినాలి అంటే కచ్చితంగా మీరు పప్పులు, పల్లీలు, నల్లశనగలు తీసుకోండి. అంతేకాదు అలసందలు వారానికి రెండు రోజులు తీసుకోండి, అలాగే చాలా మంది చిక్కుళ్లు తినరు ఇది చాలా ఐరన్ ఇస్తుంది అలాగే మంచి ఫైబర్ కంటెంట్ సోయాబీన్స్, చిక్కుళ్లు వారానికి మూడు నాలుగు సార్లు తీసుకోవాలి, ఇక ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, గోంగూర తప్పనిసరిగా తీసుకోండి… అలాగే బెల్లం కూడా వారానికి రెండు మూడు సార్లు తీసుకోండి విటమిన్ సీ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఉత్తమం.