మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

Take this food to keep the brain active

0
102

మనిషి తీసుకునే ఆహారం బట్టి అతని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నిజమే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే అతని ఆరోగ్యం చాలా బాగుంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు బాగుంటాయి అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. మరి ఏ పండ్లు తీసుకుంటే మంచిది అనేది కూడా చూద్దాం.

క్యారెట్లలో బీటా కెరోటిన్ ఇంకా స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవోన్ అలాగే యాపిల్స్ లో ఉండే ఆంథోసైనిన్, మెదడులోని నరాలను బాగా ఉత్తేజితం చేస్తాయని అందుకే పిల్లలు పెద్దలు వీటిని తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఎర్ర ద్రాక్షలో కూడా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి వీటి వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ తినడం వల్ల మన మెడదు పనితీరు బాగుంటుంది.

మీరు బెర్రీ పండ్లను వారానికి ఓరోజు తినటం వల్ల ఎంతో మంచిది. కమలాకాయ తినడం వల్ల కూడా ఇమ్యునిటీతో పాటు మీకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సోయా క్యాబేజి తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.