ప్రస్తుతం ఎండలు బగ్గుమని మండిపోతున్నాయి. దాంతో ప్రజలు తట్టుకోలేక అతలాకుతలం అవుతున్నారు. అయితే ఈ ఎండ నుండి తట్టుకోవాలంటే ఈ ఉప్పును వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.అది మరెంటో కాదు నల్ల ఉప్పు.దీనికి ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు దీని వాడకం తక్కువైంది. అయితే నిజానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి నల్ల ఉప్పు శరీరం చల్లబడడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
వేసవిలో చాలా మంది శీతలపానీయాలను తాగుతుంటారు. వాటికి బదులుగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని చల్లబరిచే గుణం నల్ల ఉప్పుకు ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు నల్ల ఉప్పును రోజూ తీసుకుంటే ఆ సమస్య వెంటనే బయటపడవచ్చు.
గ్యాస్ సమస్యలతో బాధపడేవారు చిటికెడు నల్ల ఉప్పు తింటే ఉపశమనం కలుగుతుంది.కడుపులో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవారు, గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే ఫలితం ఉంటుంది.వేసవిలో నల్ల ఉప్పును రోజూ వాడడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి చేయకుండా ఉంటుంది.