చాలా మంది చింత పండుని ఇష్టంగా తింటారు. అసలు కొన్ని వంటకాలు అయితే ఆ పులుపు ఉండాల్సిందే పులిహోర నుంచి సాంబార్ వరకూ అంతా ఈ చింతపండు ఉంటేనే టేస్ట్ ఉంటాయి. వంటల్లో చింతపండు దండిగా వేస్తారు కొందరు. మరికొందరు చింత పండు అంటే దూరంగా ఉంటారు. ఆ పులుపు వద్దు అంటారు. కొన్ని రకాల వంటకాలు అసలు చింతపండు లేకపోతే ఆ రుచిని కోల్పోతాయి. అయితే మనలో చాలా మంది ఈ చింత పండు ఎక్కువగా తింటే చెవిలో గులిమి వస్తుంది అని అంటారు. అయితే వైద్యులు ఏమి చెబుతున్నారో కూడా చూద్దాం.
చింతపండులో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.కాల్షియం, విటమిన్ సీ, ఇ, బీ, ఐరన్, భాస్వరం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ రోగులు కూడా ఈ చింత పండు తీసుకోవచ్చు.
కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది.
మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అయితే చెవిలో గులిమికి ఈ చింతపండుకి సంబంధం లేదని చెబుతున్నారు వైద్యులు. కేవలం ఇది అపోహ మాత్రమే.