వాసన, రుచి కోల్పోయారా అయితే వెంటనే ఈ పని చేయండి

వాసన, రుచి కోల్పోయారా అయితే వెంటనే ఈ పని చేయండి

0
84

ఈ కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి తీవ్ర జ్వరం జలుబు ఈ లక్షణాలు మాత్రమే ముందు కనిపించాయి, కాని ఇప్పుడు చాలా వరకూ అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి, మరీ ముఖ్యంగా పలు పరిశోధనల్లో కూడా తేలింది, అయితే కొందరికి వెంటనే లక్షణాలు కనిపిస్తే మరికొందరికి వెంటనే లక్షణాలు బయట పడటం లేదు.

తాజాగా వైద్యులు ఓ మాట చెబుతున్నారు..కరోనా సోకిన వారు వాసన గుర్తించడం కష్టమే. అయితే కరోనా వల్ల కలిగే దగ్గు, జ్వరం లక్షణాల కన్నా.. వాసన గుణం కోల్పోతే అప్పుడు కచ్చితంగా కరోనా వైరస్ సంక్రమించినట్లు భావించవచ్చు, తాజాగా చాలా మందికి పాజిటీవ్ వచ్చిన వారికి ఓ లక్షణం పక్కాగా ఉంటోంది.

80 శాతం మంది వాసన గుణాన్ని కోల్పోయినట్లు చెప్పారు. కేవలం స్వల్ప లక్షణాలు ఉన్నవారిపైనే ఈ పరిశోధన చేపట్టారు.. ముక్కు గొంతు – నాలుక వెనుభాగంలో ఉన్న కణాలను వైరస్ పట్టడం వల్ల వారికి ఈ రుచి వాసన తెలియడం లేదు.