కొందరు వ్యాపారులు అక్రమంగా డబ్బు సంపాదించాలి అని చాలా దారుణాలు చేస్తారు, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోరు, తాజాగా ఓ వ్యాపారి 50 కేజీల బస్తాలతో ఆటోలతో భారీగా లూజ్ టీ పొడి తీసుకువచ్చి, దీనిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేస్తున్నాడు.
అయితే అతను లూజ్ టీపొడిలో బాదం అసైన్స్ కలుపుతున్నాడు, ఇలా చేయడం వల్ల టీ డికాషన్ బాగా వచ్చినట్లు కనిపిస్తుంది అని ప్లాన్ తో చేస్తున్నాడట.
ఇది చాలా మంది వ్యాపారులకు తెలియకుండా టీ షాపులకి అమ్మేవాడు.. ధర తక్కువ అవడంతో అలాగే అందరూ కొనేవారు, దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకి కంప్లైంట్ వచ్చింది అతని ఇంటిలో పరిశీలిస్తే ఇతని దుర్మార్గం బయట పడింది. ఇలాంటి టీ తాగితే పేగులు జీర్ణకోశం దెబ్బతింటుంది అని తెలిపారు అధికారులు.