ఉదయం టీ తాగకపోతే మా బండి కదలదు అంటారు చాలా మంది అవును ఆ టీ తాగితే కాని అసలు ఏ పని చేయరు కొందరు, ఇక ఉదయం లేవగానే కాఫీ లేదా టీ బెడ్ దగ్గరకు వచ్చేయాలి కొందరికి, ఇక తలనొప్పి చికాగు ఉంది అంటే కచ్చితంగా కప్పు టీ తాగాల్సిందే, అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు తాగే టీ మనకు ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఇప్పుడు చూద్దాం, దీని వలన లాభ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
టీ- లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. కొవ్వు పదార్థాలైన ట్రైగ్లిజరైడ్స్ ను కొంతమేర తగ్గిస్తాయి. ఇలా తాగడం వలన పక్షవాతం వచ్చే అవకాశం ఉండదు, ఇక వేడి వేడి టీ మాత్రమే తాగాలి, చల్లారిన టీ తాగకూడదు. వేడిటీలోనే ప్లావనాయిడ్స్ ఉంటాయి, అందుకే వేడిగా తాగాలి.
ఇక టీ తాగితే ఎక్కువ ఐరెన్ మనం కోల్పోతాము అని అంటున్నారు డాక్టర్లు, ఎక్కువ టీ తాగితే ఫ్లోరోసిస్ రావొచ్చట. భోజనం చేసిన నాలుగు గంటల తర్వాత మాత్రమే టీ తాగాలి ఉదయం టిఫిన్ కు గంట ముందు టీతాగాలి లేకపోతే శరీరానికి అంత మంచిది కాదు. ఎక్కువ టీ తాగితే పళ్లు కూడా దెబ్బతింటాయి.