తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

Telangana Corona Bulletin Release..What are the new cases?

0
79

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 3606 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

ఇక ఈరోజు 2,707 మంది కోలుకోగా..ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,95,942 మంది రికవరీ అయ్యారు. తాజాగా ఒక్కరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4072కి చేరాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.