తెలంగాణ కోవిడ్ బులిటెన్ రిలీజ్ : కొద్దిగా తగ్గిన కేసులు, జిల్లాల లిస్ట్ ఇదే

Telangana Corona Cases Bulletin Released

0
140

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే గురువారం కొద్దిగా తగ్గింది. గురువారం వెల్లడైన కరోనా బులిటెన్ లో 1088 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు ఏడు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.
బుధవారం నమోదైన 1114 కేసులతో పోలిస్తే… మంగళవారం కేసులు 1175 కంటే స్వల్పంగా తగ్గుదల కనబడుతుండగా నేడు నమోదైన కేసులు 1088 పోలిస్తే మరింతగా తగ్గాయి. అయితే సోమవారం 1197 కేసులు నమోదయ్యాయి.
గురువారం మరణాల సంఖ్య 9 గా నమోదైంది. బుధవారం 12 మంది మరణించగా, మంగళవారం మరణాల సంఖ్య 10తో పోలిస్తే ఇవాళ తక్కువే అని చెప్పాలి.
జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 137 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 119466 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1511 గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 16030 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 946.
గురువారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 2
కొత్తగూడెం 51
జిహెచ్ఎంసి 137
జగిత్యాల 22
జనగామ 10
జయశంకర్ భూపాలపల్లి 22
జోగులాంబ గద్వాల 6
కామారెడ్డి 2
కరీంనగర్ 64
ఖమ్మం 86
కొమరం భీం ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 24
మహబూబాబాద్ 50
మంచిర్యాల 42
మెదక్ 10
మేడ్చల్ మల్కాజ్ గిరి 54
ములుగు 21
నాగర్ కర్నూల్ 14
నల్లగొండ 68
నారాయణపేట 7
నిర్మల్ 4
నిజామాబాద్ 7
పెద్లపల్లి 48
రాజన్న సిరిసిల్ల 18
రంగారెడ్డి 65
సంగారెడ్డి 17
సిద్దిపేట 42
సూర్యాపేట 64
వికారాబాద్ 15
వనపర్తి 18
వరంగల్ రూరల్ 23
వరంగల్ అర్బన్ 39
యాదాద్రి భువనగిరి 29

 మీ కోసం మరో వార్త ప్రచురితం అయింది..కింద లింక్ ని క్లిక్ చేయండి..

‘మా’ ఎన్నికల్లో చిరు ఫ్యామిలీ మద్దతు ఎవరికంటే?