హైదరాబాద్ లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు : జిల్లాల బులిటెన్ రిలీజ్

Telangana Corona Cases Bulletin Released

0
106

హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఇవాళ మరింతగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ కూడా డబుల్ డిజిట్ కేసులే జిహెచ్ఎంసి పరిధిలో నమోదు అయ్యాయి. ఇవాళ తెలంగాణ మొత్తంలో కేసులు 784 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. ఇవాళ మరణాల సంఖ్య 5 గా నమోదు అయింది. మంగళవారం నాటి బులిటెన్ లో మరిన్ని వివరాలు, జిల్లాల వారీగా కేసుల సంఖ్యను దిగువన ఇస్తున్నాము.
ఇవాళ 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదు అయ్యాయి. త్రిబుల్ డిజిట్ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. మిగిలినవన్నీ డబుల్ డిజిట్ కేసుల జిల్లాలే ఉన్నయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఒకసారి చూద్దాం.

ఆదిలాబాద్ 4
కొత్తగూడెం 32
జిహెచ్ఎంసి 89
జగిత్యాల 21
జనగామ 10
జయశంకర్ భూపాలపల్లి 15
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 5
కరీంనగర్ 51
ఖమ్మం 30
కొమరం భీం ఆసిఫాబాద్ 5
మహబూబ్ నగర్ 13
మహబూబాబాద్ 26
మంచిర్యాల 45
మెదక్ 5
మేడ్చల్ మల్కాజ్ గిరి 37
ములుగు 13
నాగర్ కర్నూల్ 6
నల్లగొండ 71
నారాయణపేట 2
నిర్మల్ 3
నిజామాబాద్ 11
పెద్లపల్లి 52
రాజన్న సిరిసిల్ల 24
రంగారెడ్డి 40
సంగారెడ్డి 16
సిద్దిపేట 25
సూర్యాపేట 31
వికారాబాద్ 5
వనపర్తి 6
వరంగల్ రూరల్ 15
వరంగల్ అర్బన్ 50
యాదాద్రి భువనగిరి 22

ఇవాళ మొత్తం 105186 టెస్టులు జరిపారు. ఇవాళ కరోనా నుంచి 1028 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 11455 ఉంది. ఇవాళ మరణాల సంఖ్య 5 గా నమోదైంది.

ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 628282 నమోదు కాగా 613124 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3703 గా నమోదైంది.

ఇక పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1370.

 ఈ వార్త కూడా చదవండి….

కరోనా నిర్ధారణకు ఇకపై ఆ టెస్టులు మాత్రమే : సిఎం జగన్ ఆదేశాలు