తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

0
87

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,697 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1825 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,043కి చేరుకుంది. కరోనా బారి నుంచి 351 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 14995 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది. ఒక్క GHMC లోనే 1042 కేసులు నమోదు కావడం గమనార్హం.

ఆదిలాబాద్ 5
కొత్తగూడెం 18
జిహెచ్ఎంసి 1042
జగిత్యాల 8
జనగామ 3
జయశంకర్ భూపాలపల్లి 2
జోగులాంబ గద్వాల 2
కామారెడ్డి 5
కరీంనగర్ 21
ఖమ్మం 27
కొమరం భీం ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 22
మహబూబాబాద్ 25
మంచిర్యాల 38
మెదక్ 12
మేడ్చల్ మల్కాజ్ గిరి 201
ములుగు 2
నాగర్ కర్నూల్ 16
నల్లగొండ 7
నారాయణపేట 2
నిర్మల్ 3
నిజామాబాద్ 26
పెద్లపల్లి 25
రాజన్న సిరిసిల్ల 3
రంగారెడ్డి 147
సంగారెడ్డి 51
సిద్దిపేట 13
సూర్యాపేట 4
వికారాబాద్ 7
వనపర్తి 8
వరంగల్ రూరల్ 8
వరంగల్ అర్బన్ 47
యాదాద్రి భువనగిరి 15