తెలంగాణలో మళ్ళీ కరోనా పంజా : హైదరాబాద్ ను మించిన ఆ జిల్లా

Telangana Covid Cases Bulletin Released

0
114
Corona

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా పంజా విసరబోతున్నదా? అంటే నిన్నటితో పోల్చి చూస్తే అవుననే అనిపిస్తోంది. సోమవారం నాడు నమోదైన కేసులకు, ఆదివారం నాడు నమోదైన కేసులకు భారీ వ్యత్యాసం ఉంది. ఇవాళ 696 కేసులు నమోదయ్యాయి. నిన్న ఆదివారం 465 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ లెక్కన కేసుల పెరుగుదల రేటు అమాంతంగా పెరిగింది. అయితే ఈ పెరుగుదల ఇలాగే ఉంటే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు.

మరోవైపు ఖమ్మం జిల్లాలో కేసులు ప్రమాదకరంగా పెరిగాయి. హైదరాబాద్ గత కొంతకాలంగా హైదరాబాద్ లో కేసులు పెద్దమొత్తంలో నమోదైన పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువ కాబట్టి. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇవాళ హైదరాబాద్ ను బీట్ చేసి కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో 68 కేసలే నమోదైతే… ఖమ్మం జిల్లాలో మాత్రం 82 కేసులు వచ్చాయి. ఆ జిల్లాలో కేసుల పెరుగుదలపై సర్కారు ఆరా తీస్తోంది.

కరోనా తగ్గుముఖం పడుతుందని ఊరటచెందుతున్న జనానికి ఇవాళ వచ్చిన కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం నాడు సుమారు 250 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవాళ మరణాల సంఖ్య 6 గా నమోదైంది. జిహెచ్ఎంసి పరిధిలో 68 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇవీ…

ఆదిలాబాద్ 2
కొత్తగూడెం 35
జిహెచ్ఎంసి 68
జగిత్యాల 21
జనగామ 6
జయశంకర్ భూపాలపల్లి 15
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 2
కరీంనగర్ 45
ఖమ్మం 82
కొమరం భీం ఆసిఫాబాద్ 1
మహబూబ్ నగర్ 8
మహబూబాబాద్ 23
మంచిర్యాల 19
మెదక్ 4
మేడ్చల్ మల్కాజ్ గిరి 31
ములుగు 19
నాగర్ కర్నూల్ 4
నల్లగొండ 49
నారాయణపేట 3
నిర్మల్ 4
నిజామాబాద్ 7
పెద్లపల్లి 48
రాజన్న సిరిసిల్ల 18
రంగారెడ్డి 33
సంగారెడ్డి 3
సిద్దిపేట 24
సూర్యాపేట 33
వికారాబాద్ 4
వనపర్తి 6
వరంగల్ రూరల్ 6
వరంగల్ అర్బన్ 48
యాదాద్రి భువనగిరి 21
ఇవాళ జారీ అయిన బులిటెన్ లో చూస్తే 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి.
ఇవాళ మొత్తం 105797 టెస్టులు జరిపారు. ఇవాళ కరోనా నుంచి 858 మంది కోలుకున్నారు. ఇప్పడు రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 10148 ఉంది.
ఇక పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 549.