తెలంగాణలో నేడు ఐదు జిల్లాలకు ఎగబాకిన త్రిబుల్ డిజిట్ కోవిడ్ కేసులు, మరో ఐదు జిల్లాల్లో సింగిల్ డిజిట్

0
118

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ బలహీనపడిపోతున్నది. తెలంగాణలో కేసుల సంఖ్య గడిచిన వారం రోజులుగా గణనీయంగా తగ్గిపోతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టడంతోపాటు మరోవైపు టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచింది. దీంతో కరోనా కట్టడి సులభతరమైంది. అయితే ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణలో ఐదు జిల్లాల్లో మాత్రం త్రిబుల్ డిజిట్ స్థాయిలో ఇవాళ కేసులు నమోదయ్యాయి. నిన్న కేవలం మూడు జిల్లాల్లోనే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా ఇవాళ ఆ సంఖ్య ఐదుకు చేరింది. జిహెచ్ఎంసి, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ఇక సింగిల్ డిజిట్ స్థాయిలో కేసలు నమోదైన జిల్లాలు చూస్తే ఐదు జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, నారాయణపేట ఉన్నాయి. నిన్న నాలుగు జిల్లాల్లో మాత్రమే సింగిల్ డిజిట్ కేసులు నమోదు కాగా తాజాగా నారాయనపేటలోనూ సింగిల్ డిజిట్ కే కేసులు పరిమితమయ్యాయి.

జిల్లాల వారీగా కేసలు సంఖ్యను కింద ఉన్న డేటాలో చూడొచ్చు.

రాష్ట్ర వ్యాప్త సమాచారం… చూస్తే…

తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసుల సంఖ్య చూస్తే..1771 నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి పెద్దగా తేడా లేదనిపిస్తోంది. నిన్న లక్షకు పైగా టెస్టులు చేయగా ఇవాళ లక్షా 20వేల టెస్టులు చేశారు. నిన్న 1700కు పైగా కేసులు నమోదు కాగా ఇవాళ కూడా 1700 సంఖ్యను దాటాయి. అయితే మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇవాళ కేవలం 13 మంది మాత్రమే కోవిడ్ తో మరణించారు. కోలుకున్న వారి సంఖ్య కొత్త కేసుల కంటే ఇవాళ కూడా ఎక్కువే ఉంది. మరిన్ని వివరాలు కింద చూడొచ్చు.

ఈరోజు కోలుకున్న వారి సంఖ్య 2384

ఈరోజు మృతుల సంఖ్య 13

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 21983

ఇవాళ చేసిన కోవిడ్ టెస్టుల సంఖ్య 1,20,525

పెండింగ్ లో ఉన్న రిపోర్టుల సంఖ్య 1380