తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం : ఇవాళ ఎన్ని కేసులు వచ్చాయంటే?

0
100

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,707 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం  5.30 గంటల వరకు కరోనాతో 16 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,456కి చేరింది.

కరోనా నుంచి ఇవాళ 2,493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 1009 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.

కొత్త కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కరోనా సెకండ్ వేవ్ బలహీనపడుతున్నట్లే కనబడుతున్నదని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.