కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు..6 కోట్ల డోసుల పంపిణీ

0
106

కరోనా మహమ్మారి ప్రభావం దేశంపై ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో రాకాసి కరోనా ఎన్నో ప్రాణాలను బలిగొంది. ఇలాంటి కష్ట తరుణంలో భారత వైద్యులు కరోనా టీకా తయారు చేయడం అది విజయవంతం అవ్వడం నిజంగా అద్భుతమే. ఎందుకంటే కరోనాను ఎదురించడానికి ఉన్న ఏకైక అస్త్రం వాక్సిన్. తాజాగా ఈ వ్యాక్సినేషన్‌లో పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. ఈ 6 కోట్ల డోసుల్లో 3.11 కోట్ల మంద‌కి ఫ‌స్ట్ డోసు, 2.83 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి అయ్యాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.మరో 5.18 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇవ్వగా, 12 నుంచి 14 ఏళ్ల మధ్య వారికి ఇప్పటికే 19 శాతం మందికి టీకా పంపిణీ పూర్తి అయింది.

రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్​ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్​ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2,05,89,099 ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది. మరోవైపు 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని మొదలుపెట్టింది కేంద్రం.