తమలపాకులతో కలిగే పది ప్రయోజనాలు ఇవే

తమలపాకులతో కలిగే పది ప్రయోజనాలు ఇవే

0
91

మనం పూజల్లో వ్రతాల్లో ఎక్కువగా తమలపాకులు వాడకం చూస్తాం, అలాగే తమలపాకులు తాంబూలం కూడా వేసుకుంటారు, ఇలా నిత్యం భోజనం తర్వాత తీసుకునే వారు చాలా మంది ఉంటారు, అయితే ఇలా తాంబూలం తీసుకుంటే బీపీ సమస్య మరింత పెరుగుతుంది , ఎక్కువ తాంబూలం తీసుకోకూడదు, ఇందులో కలిపే సున్నం వల్ల ప్రమాదాలు ఉంటాయి.

రోజుకి ఓసారి లేదా వారానికి ఐదు సార్లు తీసుకుంటే మంచిది. ఈ సున్నం పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది ..అందుకే పెద్దలు 65 ఏళ్లు దాటిన వారు సున్నం తక్కువ వాడాలి, అసలు వాడకపోయినా మంచిదే.

సున్నం వల్ల ఆస్టియోపోరోసిస్… అంటే ఎముకలు గుల్లబారటం సమస్య రాకుండా ఉంటుంది. మితిమీరి సున్నం వేస్తే చాలా డేంజర్ ..అలాగే వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు ఉపయోగపడుతుంది, మంచి వక్క వాడాలి, అలాగే సున్నం ఇష్టం లేకపోతే వక్క తమలపాకు కలిపి తీసుకున్నా మంచిదే . రోజుకి ఓ తమలపాకు తిన్నా శరీరం లో కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గుతాయి.. మనిషి సన్నబడతాడు, వారానికి ఐదు ఆకులు తీసుకున్నా జలుబు దగ్గు సమస్యలు రావు.