తాటి బెల్లం తింటే ఎన్ని ఉపయోగాలో తప్పక తెలుసుకోండి

తాటి బెల్లం తింటే ఎన్ని ఉపయోగాలో తప్పక తెలుసుకోండి

0
145

చాలా మందికి బెల్లం తెలుసు కాని తాటి బెల్లం తెలియదు, అయితే రుచిలోనే కాదు ఆరోగ్యంలో కూడా ఇది చాలా మంచిది, ఇక చాలా మంది మహిళలు కూడా తాటి బెల్లం ఇప్పటికీ వాడతారు, షుగర్ తగ్గించి బెల్లం కూడా చాలా మంది టీ కాఫీలకి పాలకి వాడుతున్నారు.

తాటి బెల్లం పూర్వీకుల నుంచి నేటి కాలం వరకూ అందరూ చాలా మంచిది అని చెబుతారు. తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది.

ఇందులో ఐరెన్ ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల లేడీస్ కు రక్తహీనత సమస్య ఉండదు, అందుకే దీనిని రజస్వల అయిన అమ్మాయిలకి ఇస్తారు.కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది.చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది…దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్ తొలగించడంలోనూ సాయపడుతుంది. దగ్గు గురక తగ్గుతుంది, అందుకే దీ బెస్ట్ అంటే తాటి బెల్లం అంటారు.