తాటికాయలు తింటే కలిగే లాభాలు ఇవే

తాటికాయలు తింటే కలిగే లాభాలు ఇవే

0
389

తాటికాయల పేరు చెబితే పాత రోజులు గుర్తు వస్తాయి, ఇప్పుడు అందరూ ఉద్యోగాల కోసం పట్టణాలు వచ్చారు కాని నాటి రోజుల్లో తాటికాయ దొరికింది అంటే ఆ ఇంట్లో ఇక రొట్టె వేసినట్లే, ఇలా గ్రామాల్లో సీజన్ వస్తే కచ్చితంగా తాటికాయ రొట్టె ఇడ్లీ గారెలు వేసేవారు అందరూ.

తాటి ముంజకాయలు ముదిరి తాటికాయలుగా మారుతాయి. వీటి నుంచి వచ్చే తాటిచాప, తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ప్రయోజనాలు వున్నాయి. ఇప్పుడు ప్యాకెట్లలో నగరాలకు కూడా వస్తున్నాయి, అయితే తాటి బెల్లం కూడా ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే ఈ తాటి పండు తినేవారు కూడా ఉంటారు, అంత రుచిగా ఉంటుంది, తాటి కాయలు తింటే తరచూ వచ్చే జలుబు సమస్య తగ్గుతుంది, శరీరం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.. దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలను తొలగించడంలోనూ సాయపడుతుంది ఈతాటి బెల్లం. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా వుండే తాటిబెల్లం మైగ్రేన్, బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది, అంతేకాదు శరీరం వేడి చేయకుండా చలువ చేస్తుంది. ఐరనె లోపం ఉన్న వారు ఇది తీసుకుంటే చాలా మంచిది.. జీర్ణం కూడా బాగా అవుతుంది.