తాటి ముంజలు తింటున్నారా ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి

తాటి ముంజలు తింటున్నారా ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి

0
89

స‌మ్మ‌ర్ వ‌చ్చింది అంటే ఆ నాలుగు నెల‌లు తాటి ముంజ‌లు బాగా దొరుకుతాయి. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే లోతాటి ముంజ‌లు బాగా దొరుకుతాయి.. ఇక పల్లెటూరులో వారు ఈ ముంజ‌లు ఎక్కువ‌గా తింటారు.. ఇప్పుడు న‌గ‌రాల‌కు కూడా ఇవి అమ్మేందుకు తీసుకువ‌స్తున్నారు.

ఇక ముంజ‌లు తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్ధ బాగుంటుంది… ర‌క్తపోటు అదుపులో ఉంటుంది, వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంచుతుంది… శ‌రీరంలో వ్య‌ర్ధ ప‌ధార్దాల‌ను తొల‌గిస్తాయి, లివ‌ర్ వ్యాధులు ఉంటే త‌గ్గిస్తుంది చ‌ర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, అందుకే తాటి ముంజ‌లు తింటే చాలా మంచిది.

ఇక ముంజ‌లు చాలా మంది ఫ్రిజ్ లో పెట్టుకుని తింటారు… ఇది మంచిది కాదు.. ఉదయం కుండ నీటిలో వేసుకుని సాయంత్రం తింటే చ‌ల్ల‌గా వంటికి మంచిది.. ఫ్రిజ్ లో ఇవి పెట్ట‌కండి, ఇక ముంజ‌లు తీసిన త‌ర్వాత వాటిని బ‌య‌ట కొనే స‌మ‌యంలో క‌చ్చితంగా క‌డుక్కొని తినండి.. దీని వ‌ల్ల ఏ బ్యాక్టిరీయా వాటిమీద ఉన్నా పోతుంది. ఇక రెండు మూడు రోజులు నిల్వ చేసుకుని తిన‌వ‌ద్దు ఫ్రెష్ గా తింట‌నేనే మంచిది.