కేంద్రం కీలక నిర్ణయం..12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు..ఎప్పటి నుంచి అంటే?

The center is a key decision..Corona vaccinations for children 12 to 14 years

0
76

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై జనవరి 16తో ఏడాది పూర్తి కావొస్తుంది. భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అయింది. కాగా, కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పిల్లల పాలిట ప్రమాదకారిగా మారుతుంది.

ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 14 ఏళ్ల చిన్నారుల‌కు వ్యాక్సిన్లు అందించే దిశగా భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వీరికి మార్చి నెల నుంచి టీకాలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. అప్ప‌టిలోగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తికానుంద‌ని ఆయ‌న తెలిపారు.

దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని, 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెడో డోసు పంపిణీ కూడా మొదలువుతుందని, అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఎన్టీఏజీఐ చీఫ్ పేర్కొన్నారు.

https://twitter.com/mansukhmandviya?