వర్క్ ఫ్రమ్ చేస్తున్న సమయంలో స్మోకింగ్ చేయకూడదు కంపెనీ కొత్త రూల్

The company's new rule is not to smoke while working from home

0
89

చాలా మంది సిగరెట్ కి అలవాటు పడి ఉంటారు, కాస్త ఒత్తిడి అనిపించినా సిగరెట్ కాల్చేస్తారు. ముఖ్యంగా యూత్ ఈ సిగరెట్లకు బాగా అలవాటు పడుతున్నారు. కొందరు ఉద్యోగులు సిగరెట్లని పదే పదే తాగుతూ ఉంటారు. వీరి కోసం ఏకంగా స్మోకింగ్ జోన్స్ కూడా ఉంటాయి. ఇక ఆ ఉద్యోగి ఎవరైనా ఇలా సిగరెట్ కాలుస్తూ ఉంటే అతని ఆరోగ్యానికి కూడా ఇబ్బందే.

జపాన్లోని అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ తన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నా సరే పని చేస్తున్న సమయంలో స్మోకింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ రూల్ వచ్చే నెల అక్టోబర్ నుంచి అమలు చేయనుంది
ఇప్పటికే ఈ సంస్ధ నిర్వహిస్తున్న అన్ని స్మోకింగ్ రూమ్లను కూడా మూసివేయాలని నిర్ణయించింది.

అయితే ఇంట్లో ఉన్నవారు స్మోకింగ్ చేస్తే ఎలా తెలుస్తుందని అనుకోవచ్చు? దీనికి కంపెనీ ఏం చెబుతుందంటే మాకు ఉద్యోగులపై నమ్మకం ఉందని. వారిపై ఎలాంటి నిఘా ఉండదు అని తెలిపింది .పూర్తి ఆరోగ్యంతో ఓ ఉద్యోగి తన పూర్తి సామర్థ్యం మేరకు సేవలందించాలని సంస్థ భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రూల్ అయితే చాలా బాగుంది పొగరాయుళ్లు మరి మానేస్తారా లేదా అనేది చూడాలి.