ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు తెలుస్తుంది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నిర్ధరణ అయింది. అలాగే రాష్ట్రానికి వచ్చిన 15 మంది విదేశీ ప్రయాణికుల నమూనాలు హైదరాబాద్ సీసీఎంబీకి పంపించినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆ 15 మందిలో విజయనగరం వాసికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.