గాడిద పాల వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు..

0
119

సాధారణంగా పాలు తాగడానికి చాలామంది ఇష్టపడరు. కనీసం పాల వాసనా కూడా ఇష్టపడని వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. కానీ పాలు రోజు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. గాడిద పాల తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం కూడా ఓ లుక్కేద్దాం..

గాడిద పాలు శరీరానికి చేసే మేలు అంతాఇంతా కాదని మన పూర్వికులు చెబుతుంటే వింటుంటాము. గాడిదపాలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉండడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి  ఎక్కువగా అందుతాయి. గాడిద పాలలో  ఉండే లాక్టోస్ అనే పదార్థం కారణంగా ఎముక‌ల‌ను బ‌లంగా తయారవుతాయి.

ఇంకా మనందరికీ తెలియని విషయం ఏంటంటే..ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలనే ఉపయోగిస్తారట. కేవలం ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాకుండా చర్మ సంరక్షణకు కూడా గాడిద పాలు తోడ్పడతాయని నిపుణులు చేబుతున్నారు. గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం పొందొచ్చు అంటున్నారు నిపుణులు.