బ్రేకింగ్: పెరిగిన పాల ధర..రేపటి నుంచే అమలు

0
106

ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే..మరోవైపు నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ప్రజలకు పిడుగులాంటి వార్త చెప్పింది గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్.

లీటర్ పై రూ.2 రూపాయలు పెంచుతున్నట్లు మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. పెరిగిన ధరతో అముల్ గోల్డ్ మిల్క్ అర లీటర్ ధర రూ.31 కి, అమూల్ టాటా రూ.25 కి, అమూల్ శక్తి రూ.28 కి చేరనుంది. ఈ పెరిగిన ధరలు రేపటినుండి అమల్లోకి రానున్నాయి.