కొత్త వేరియంట్ కలకలం..ఒమిక్రాన్‌ కన్నా ప్రమాదకరం

0
86

ప్రపంచవ్యాప్తంగా ‘బీఏ.2’గా పిలిచే ఈ కొత్త రకం కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కన్నా చాప కింద నీరులా వ్యాపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 54 దేశాల్లో కనిపిస్తున్న ఒమిక్రాన్‌లోని ఒక ఉపరకంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

కొన్ని జన్యు లక్షణాల కారణంగా దీన్ని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం కావడమే ఇందుకు కారణం. మూల ఒమిక్రాన్‌ వేరియంట్‌ కన్నా ఇది ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని డెన్మార్క్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది.ఒమిక్రాన్‌ మూల వేరియంట్‌ను బీఏ.1గా పేర్కొంటున్నారు. ఆ శ్రేణిలో కొత్తగా బీఏ.2 పుట్టుకొచ్చింది.

కరోనా వైరస్‌ డేటాను పంచుకోవడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక ‘జీఐఎస్‌ఏఐడీ’లోకి ఈ ఉపరకానికి సంబంధించి 18వేలకుపైగా జన్యుక్రమాల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. ఈ వేరియంట్‌ 54 దేశాల్లో ఉంది. ఆసియా, ఐరోపాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. డెన్మార్క్‌లో వేగంగా విస్తరించి, ప్రధాన వేరియంట్‌గా మారింది. దీనివల్ల అక్కడ కొవిడ్‌ తాజా ఉద్ధృతి.. ఊహించినదానికన్నా ఎక్కువకాలం కొనసాగుతుందని భావిస్తున్నారు.