తెలంగాణలో కరోనా పరిస్థితులపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం అయింది అని కేంద్రం చెప్పింది. గత వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దముగా ఉన్నాం. 2 నుండి 6 రేట్లు కేసులు దేశంలో పెరుగుతున్నాయి.
తెలంగాణలో 4 రేట్ల కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిట్ రేట్ పెరిగింది రాష్ట్రంలో. ఆసుపత్రిలో ఆడ్మిట్ సంఖ్య పెద్దగా లేదు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసుల్లో 90 శాతం కేసుల్లో లక్షణాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు అసుపత్రిని సంప్రదించాలి. అవసరం ఉంటే అడ్మిట్ అవ్వాలి. లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందాలి.
ఇంకా డెల్టా కనుమరుగు అవ్వలేదు. రానున్న రోజుల్లో 90శాతం ఒమిక్రాన్ కేసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డెల్టా, ఒమిక్రాన్ 50-50 వస్తున్నాయి. తప్పని సరి పరిస్థితి అయితే తప్ప అసుపత్రుల్లో చేరాలి. ప్రయివేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకండి. పేషేంట్ కండిషన్ బట్టి వైద్యం, మెడిసిన్ ఇవ్వండి అని ప్రయివేట్ వైద్యులకు విజ్ఞప్తి. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకం. ఈ నెల చివర్లో కేసులు బాగా పెరుగుతాయి.
ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తే ముప్పు నుండి బయట పడవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులలో 27వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో సెలవులు రద్దు చేసాం. సంక్రాంతి పండుగ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలి. రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి వచ్చే నాలుగు వారాలు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవద్దని కోరారు.