ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్ వచ్చేసింది..ధర ఎంతో తెలుసా?

The Omicron detection kit has arrived..do you know the price?

0
80

కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించేందుకు రూపొందించిన కిట్‌ను ఆమోదించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఈ కిట్ భారత్ లో మరో వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించడానికి టాటా సంస్థ ఓ కిట్ ను రూపొందించింది. ఒమిషూర్ పేరుతో రూపొందించిన ఈ కిట్ కు ICMR ఆమోదం తెలిపింది. టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ తయారు చేసిన ఈ కిట్ తో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించవచ్చు. టాటామెడికల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  భాగస్వామ్యంతో కొత్త కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించడానికి RT-PCR టెస్ట్ కిట్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసినట్లు ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. టెస్టింగ్ కిట్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

ఈ కిట్ పరీక్షించిన నాలుగు గంటల్లో ఫలితాలను ఇస్తుందని డాక్టర్ భార్గవ తెలిపారు. దీని ధరను రూ.250గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్లతో పోల్చుకుంటే ఒమిషూర్ ధర తక్కువగా ఉంది. ఈ టెస్ట్ కిట్ జనవరి 12 నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.