షాకింగ్: పెరగనున్న ట్యాబ్లేట్ల ధరలు

The prices of many tablets will go up

0
79

ప్రజల నెత్తిన మరో భారం పడింది. ఇప్పటికే నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఈ కష్ట కాలంలో ఇది చాలదా అన్నట్టు నిత్యం ప్రజలు వాడేటువంటి పలు ట్యాబ్లేట్ల ధరలు కూడా పెరిగాయి.కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది పారసెటిమాల్ ,డోలో 650 ట్యాబ్లెట్లనే. అయితే ప్రస్తుతం వీటి ధరలు కూడా పెరగనున్నాయి. అలాగే జ్వరం, బీపీ, ఇన్ఫెక్షన్లు తదితర జబ్బులకు వాడే 800 మందుల ధరలు 10.7 శాతం పెరిగినట్లు జౌషధ ధరల సంస్థ వెల్లడించింది. అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్, ఫెనిటోరియిన్ సోడియం వంటి మందులు ఉన్నాయి. వీటితో పాటు పలు విటమిన్ ట్యాబ్లెట్లకు కూడా ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఎప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.