రక్తహీనత సమస్య చాలా మందికి ఉంటుంది. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలకు పిరియడ్స్ సమయంలో రక్తహీనత సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్య రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సమస్య ఉంది అని ఎలా గుర్తించాలి అంటే శ్వాస తీసుకోవడంలో ఇలాంటి వారికి ఇబ్బంది ఉంటుంది.
వాకింగ్, జాకింగ్, రన్నింగ్ చేసే సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు కొందరికి ఉంటాయి. ఇలాంటి సమస్య ఉంటే కచ్చితంగా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఇక ఈ సమస్య ఉన్న వారికి చర్మం రంగు కూడా మారుతూ ఉంటుంది, ఇలాంటి వారికి చాక్ పీస్ లు, సున్నం ఇలాంటివి తినాలి అనిపిస్తుంది ఇలాంటి అలవాటు కోరిక ఉంటే వెంటనే వైద్యులని కలవాలి.
మంచి పౌష్ఠిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతీ రోజు వ్యాయామం చేయడం కూడా ఉండాలి. మీరు మీ డైట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఐరన్, విటమిన్ బి 12 శరీరంలో ఎక్కువగా ఉంటే రక్తహీనత బారి నుండి తప్పించుకోవచ్చు.