వర్షాకాలం వచ్చేసింది..సీజనల్ వ్యాధులతో తస్మాత్ జాగ్రత్త

0
154

కొద్దిరోజులుగా వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు నుంచి భారీ వాన‌లు కురుస్తున్నాయి. ఇలా సీజ‌న్ మారిన‌ప్పుడు సాధార‌ణంగా ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో జ‌లుబు, వైర‌ల్ ఫీవ‌ర్లు, ఇత‌ర‌త్రా అంటువ్యాధులు వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఓ పక్క కరోనా మరో పక్క సీజనల్ వ్యాధులు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వాతావరణంలోని మార్పుల వల్ల అనేక రకాల వ్యాధులు తలెత్తడం సహజం. కానీ వాటిని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మీ ఆరోగ్యం గురించి ఏ చిన్న అనుమానం తలెత్తినా మీ సొంత వైద్యం కాకుండా.. నిపుణుల సలహా తీసుకున్నాకే ఆయా మాత్రలు, సప్లిమెంట్స్‌ వేసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

జాగ్రత్తలు ఇవే..
వండుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి.

ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు.

నీటిని శుద్ధి చేసుకుని లేదా వేడి చేసుకుని తాగ‌డం మంచిది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగై, విరోచనం సాఫీగా జరుగుతుంది.

ఆవ‌పిండితో చేసిన వంట‌కాలు తిన‌డం వ‌ల్ల అంటువ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.