వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కాస్త వర్షంలో తడిచినా జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే వర్షంలో ఎక్కువ తడవద్దు అంటారు. ఇక ఈ సమయంలో వాతావరణంలో మార్పు రావడంతో మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా కొన్నింటికి దూరంగా ఉండాలి.
వానా కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందుకే మనం కడుపులో వేసే ఫుడ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది.ముఖ్యంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకుంటే మంచిది. ఇక ఆకుకూరలు మరీ తప్పదు అనుకుంటే తీసుకోండి ఎందుకంటే, వర్షాకాలం ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక కారం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. అతిగా వద్దు ఇది కూడా అజీర్తి ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం తెస్తుంది. ఇక సలాడ్లు, ఐస్ క్రీమ్స్ జోలికి వెళ్లవద్దు.
ఇక ఈ సమయంలో గోరు వెచ్చని నీరు మాత్రమే తీసుకోండి. అల్లం వెల్లుల్లి పసుపు మీ ఫుడ్ లో ఉండేలా చూసుకోండి.నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సీ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి.
రోజూ నిమ్మనీరు తాగేలా చూసుకోండి.ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కడా నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. వర్షాకాలం సీ ఫుడ్ కు దూరంగా ఉండండి.