మనం చాలా సందర్బాలలో ఆవలిస్తూ ఉంటాం, ఏదైనా బోరింగ్ అనిపిస్తున్నా, క్లాసు నచ్చకపోయినా ఇలా అనేక చోట్ల మనం ఆవలిస్తూ ఉంటాం, అయితే అవతల వారికి నువ్వు అవలించేసరికి చెప్పాలి అనే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి, ఇక ఒకరు ఆవలిస్తే పక్కవారికి కూడా ఆవలింత వస్తుంది, మరి ఇలా ఆవలింతలు రావడానికి గల కారణాలు ఏమిటి అనేది చూద్దాం.
నిజానికి ఈ ఆవిలింతలు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతాయట. అప్పుడు మొదలైన అలవాటు జీవితాంతం వదలిపెట్టదు. మనకు ఇలా ఎందుకు వస్తాయి అంటే సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల, మెదడుకి సరిపడా ఆక్సిజన్ అందకపోవటం వల్లనే ఈ ఆవిలింతలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాని మన పెద్దలు ఏమి అంటారు అంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల అని అంటారు.
మెదడుకి ఆక్సిజన్ను అందించడానికి శరీరం ఆవలింతల రూపంలో అధిక మొత్తంలో గాలిని తీసుకుంటుందట. దీంతో మెదడు చురుగ్గా పని చేస్తుందని తేలింది. మొత్తానికి మనిషి తన జీవిత కాలంలో 400 గంటల ఆవలిస్తాడు, సుమారు 2 లక్షల సార్లు ఆవలింతలు వస్తాయి సగటు మనిషి జీవితకాలంలో, మనిషితో పాటు జంతువులు కూడా ఆవలిస్తాయి అనేది తెలిసిందే.