అనారోగ్యంలో పావురాల ‘పాత్ర’..నిజమెంత?

0
132
Pigeon Racing

సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ చనిపోయినప్పటి నుండి పావురాల టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మరణించగా దానికి కారణం పావురాలు అనే విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. విద్యాసాగర్ మరణించడానికి అసలు కారణం పావురాలు అని చెప్పిన వైద్యులు.. పావురాల పెంపకం చేపట్టే వారికి కూడా అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పావురాలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదా? పావురాల ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలుకలు ఎలా మనుషుల ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయో అలాగే పావురాల నుంచి కూడా మనకు ముప్పు పొంచి ఉందని నిపుణులు పేర్కొన్నారు. పావురాలు వదిలే రెట్టల్లో ఎసిడిక్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.. వాతావరణంలో ఇది వేగంగా కలిసిపోయి ముఖ్యంగా ఆస్తమా రోగులకు ప్రాణాంతకంగా మారుతాయి.. ఇంకా సల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా హానికరమే. దీనివల్ల ఎలెర్జీలు సైతం వస్తాయని, కొన్ని సందర్భాల్లో పావురాల రెక్కల్లో ‘ఎవియన్ ప్రోటీన్స్’ వంటివి కూడా ప్రమాదకరమేనని ఆయన తేల్చారు.

పావురాలకు ఆహారం వేయడం మంచిదే కానీ, ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బులున్న వారు వీటికి దూరంగా ఉండడమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పావురాల పెంపకం తదితరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.