ఈ మామిడిపండ్ల ధర తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే?

0
98

చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడేవాటిలో మామిడి పండు కూడా ఒకటి. కానీ మనం సాధారణంగా తినే మామిడి పండ్లతో పోలిస్తే అత్యంత తీపిగా ఉండే మామిడి పండు జపాన్ కు చెందిన మియాజాకి. ఇది ప్రపంచంలోనే అత్యంత తీపైన మామిడిపండుగా పేరు గాంచింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జపాన్ లోని మియాజాకి పట్టణంలో ఇది సాగవుతుంది. ఈ మామిడి పండు పర్పుల్ రంగంలో ఉంటుంది. ఒక్కో పండు 350 గ్రాములు ఉంటూ..చక్కెర పరిమాణం 15 శాతం. రంగు, ఆకృతి పరంగా ఈ మామిడి పండు ఇతర మామిడి పండ్లకు భిన్నంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఒకినవా మ్యాంగో తర్వాత రెండో స్థానం దీనిదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో పాటు..బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కూడా లభిస్తాయి.

ప్రస్తుతం మియాజాకి రకం మామిడిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు సాగు చేస్తున్నారు. ఇది క్రమక్రమంగా బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు కూడా వ్యాప్తిచెందుతుంది. అంతేకాకుండా దీనిని పండ్లలో రాజుగా (కింగ్ ఆఫ్ ఫ్రూట్స్) చెబుతారు. కానీ ఈ మామిడి ఖరీదు తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలు ఉంటుందట. జపాన్ వాసులు ఈ పండును ‘ఎగ్ ఆఫ్ సన్’ గా భావిస్తుంటారు. జపాన్ లో ఈ రకం పెద్ద మొత్తంలోనే సాగవుతుంది.