ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆ పాత్రల వాడకం మళ్లీ పెరిగింది

The use of clay pots increased again

0
83

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇది ఎప్పుడూ మనం మరువకూడదు. మన తాతలు ముత్తాతల కాలం నుంచి చూస్తే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజుల్లో మార్కెట్లో ఎన్నో ఆధునికమైన పాత్రలు వంట చేసుకోవడానికి వచ్చాయి. అయినా కొందరు ఇంకా మెటల్ పాత్రలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కొందరు మట్టి పాత్రల్లో భోజనం వండేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ రోజుల్లో కుండల వాడకం తిరిగి ప్రారంభమైంది. చాలా మంది ఈ రోజుల్లో మట్టి కుండల్లో పెరుగుని కూడా తోడుపెడుతున్నారు. అంతేకాకుండా మట్టి గాజులు, జగ్, తవా, పాన్,నీటి కోసం సీసాలు, టెర్రకోట పాత్రల వాడకం కూడా పెరుగుతోంది. చెక్క, వెదురు పాత్రలు కూడా చాలా మంది కొంటున్నారు. చెక్క మూతలు చెక్క కప్పులు వాడుతున్నారు.

వెదురు, కొబ్బరితో చేసిన పాత్రలను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వాల్నట్ చెట్టు ఆకుల నుండి తయారు చేసిన ప్లేట్లు, గిన్నెలు కూడా తేలికపాటి పనుల కోసం వినియోగిస్తున్నారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాదు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తున్నాయి. మళ్లీ ఇలాంటి వస్తువుల వాడకంతో పాత రోజులు గుర్తు వస్తున్నాయి అంటున్నారు పెద్దలు.