అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ విషయంలో అయినా ఇద్దరూ సమానమే. ఇటు అన్ని అవకాశాలు అమ్మాయిలు అందిపుచ్చుకుంటున్నారు. గతంలో అబ్బాయిలే కుటుంబాన్ని చూసుకుంటారు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని చివరి వరకూ చూస్తున్నారు.
అప్పట్లో అమ్మాయి పుడితే భారంగా భావించేవారు కొందరు. అబ్బాయి వారసుడు కావాలి అనేవారు. కాని ఈరోజుల్లో అలాంటి ఆలోచన చాలా మందికి లేదు. కొందరు అయితే అమ్మాయి పుట్టగానే నా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి తనకు కూతురు పుట్టిన ఆనందంలో ఏం చేశాడంటే?
మధ్యప్రదేశ్‌కు చెందిన అంచల్ గుప్తా స్థానికంగా పానీపూరీ అమ్ముతుంటాడు. అతనికి ఆడపిల్లలలు అంటే ఎంతో ఇష్టం. వివాహం అయిన సమయం నుంచి అమ్మాయి పుట్టాలి అని కోరుకునేవాడు. చివరకు
రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 17న అమ్మాయి పుట్టింది. దీంతో అంచల్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయం అందరికి చెప్పి స్థానికులందరికీ ఉచితంగా పానీపూరీ పంచిపెట్టాడు. దీనికోసం రూ.50వేలు ఖర్చుపెట్టాడు. అతను చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ అతనిని అభినందిస్తున్నారు.