వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలివే..

0
90

ఉష్ణోగ్రతలు అధికం కావడంతో ఉదయం 10 దాటితే అడుగు బయట పెట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా నీరు శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా అవి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అయితే వేసవిలో పెరుగును తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు.పెరుగులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ B-6, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ K, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే పెరుగును తినడం శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది.

రోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది.  కాబట్టి వేసవిలో క్రమం తప్పుకుండా పెరుగును తినండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు దరి చేరవు. అంతేకాకుండా లాక్టిక్ యాసిడ్ మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.