నేలపై పడుకోవడం వల్ల కలిగే బోలెడు ప్రయోజనాలివే..

0
55

ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్కరు కింద పడుకోవడానికి ఇష్టపడడం లేదు. చాలా తక్కువ శాతం మంది మాత్రమే నేలపై పడుకుంటున్నారు. కానీ నేలపై పడుకోవడం వల్ల మంచి లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నేలపై పడుకోవడం వల్ల వెన్ను సమస్యలు దరిచేరవు. ఎప్పుడైనా నెల మీద పడుకునేముందు సన్నని చాపను ఉపయోగించాలి.

నేలపై పడుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు అంటే ఎముకలు, కండరాల నొప్పులు తగ్గించి రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా భుజాల నొప్పులు దరిచేరవు. కనీసం వారానికి మూడుసార్లు ఫ్లోర్ పై పడుకోవడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చాలామంది మహిళలలు బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేలపై పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు మంచంపై పడుకున్నప్పుడు శరీర వేడి పెరుగుతుంది. దానివల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరగడం ప్రారంభమవుతుంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లగా మరి శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా ఉంచుతుంది.