కళ్ళకు కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలివే..

0
156

ఆడవారికి అందాన్ని ఇచ్చే కళ్ళకు కాటుక పెడితే మరింత అందంగా మారుతాయి. కాటుక పెడితే ఏ కళ్ళయినా ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. కాటుక కేవలం అందంగా కనబడడానికే కాదు..ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, అందంగా మెరిసేలా చేస్తుంది. కాటుకను కళ్ళకు పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. కానీ కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటపుట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాటుక పెట్టడం మానేయ్యాలి. అంతేకాకుండా ఎల్లప్పుడూ నాణ్యమైన కాటుకనే వాడాలి.