గోధుమగడ్డి రసం తీసుకుంటే కలిగే లాభాలు ఇవే – ముందు ఇలా చేయండి

These are the benefits of consuming wheatgrass juice

0
86

గోధుమగడ్డి ఇది చాలా మందికి తెలియదు దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీంతో చేసే రసానికి ప్రకృతి వైద్యంలో మంచి ప్రాముఖ్యత ఉంది. 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల్లో ఉండే పోషకాలు ఉంటాయని చెబుతారు. ఇందులో పుష్కలంగా విటమిన్ ఈ ఉంటుంది. జలుబు దగ్గు ఇలాంటి చిన్నచిన్న వ్యాధులని తగ్గిస్తుంది. కేన్సర్ రాకుండా రక్షిస్తుంది.

ఫారెన్ లో అయితే నిపుణులు గోధుమగడ్డి రసాన్ని ఆకుపచ్చ రక్తం అని కూడా అంటారు. ఈ రసంలో ఉండే క్లోరోఫిల్ రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఐరన్ లా పనిచేస్తుంది. మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో ఉంటాయి. మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం ఈ సమస్యలు తగ్గుతాయి.జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత వీటికి ఇది చక్కని ఔషదం.

* గమనిక *
ఇది అందరికి ఒకే విధంగా పని చేయదు నిపుణులని అడిగి వారిని సంప్రదించిన తర్వాత వాడటం మంచిది.